బీసీలను రాజకీయంగా విడదీసే కుట్ర జరుగుతోంది.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆరోపణలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-15 07:17:48  IST  )

రాష్ట్రంలో బీసీలను రాజకీయంగా విడదీసే కుట్ర జరగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ఆరోపించారు.

బీసీలను రాజకీయంగా విడదీసే కుట్ర జరుగుతోంది.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బీసీలను రాజకీయంగా విడదీసే కుట్ర జరగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ఆరోపించారు. ఇవాళ నగరంలోని ఇందిరా పార్క్ (Indira Park) వద్ద బీఆర్ఎస్ చేపట్టిన బీసీ ధర్నాకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. సాధ్యం కాని విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెబుతోందని అన్నారు. బీసీలు తలుచుకుంటే రాజకీయ భూకంపం రావడం తథ్యమని కామెంట్ చేశారు. రాబోయే రోజుల్లో బీసీలంతా ఒక్కతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. గతంలో బీసీ రిజర్వేషన్లపై చాలామంది సీఎంలు తీర్మానాలు చేశారని.. కానీ, రిజర్వేషన్ల అంశం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పెడితే తప్ప అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. అప్పుడే అంతా అయిపోయిట్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి సన్మానాలు.. జిల్లా, మండల కేంద్రాల్లో సంబురాలు చేస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Next Story