Prajavani: కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో చిన్నారి ఆవేదన

by Ramesh Naini |

కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో అక్షర అనే ఓ విద్యార్థిని పాల్గొని తన ఆవేదనను తెలిపింది.

Prajavani: కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో చిన్నారి ఆవేదన
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) కలెక్టరేట్‌లో జరిగిన (Prajavani) ప్రజావాణిలో అక్షర అనే ఓ విద్యార్థిని పాల్గొని తన ఆవేదనను తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలో (Representatives) ప్రజాప్రతినిధులు, (Government employees) ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు చదివితే సౌకర్యాలు మెరుగుపడతాయని సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు హాస్టల్స్ మంచిగా ఉండాలన్నా సరిపోయే స్కూల్స్, కాలేజీలు, రూములు, టీచర్లు, లెక్చరర్లు కావాలన్నా.. విద్యార్థులకు చదువు, మంచి భోజన కావాలన్నా.. ప్రభుత్వ వాచ్‌మెన్ దగ్గర మొదలు కొని కలెక్టర్, గవర్నర్, రాష్ట్రపతి వరకు, వార్డ్ మెంబర్ మొదలు కొని సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, ప్రధాని పిల్లల వరకు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్‌లో చదివి ఉండాలని తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన, చదువుతున్న వారి పిల్లలు.. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికే ప్రభుత్వ ఉద్యోగానికి, ప్రజాప్రతినిధులకు అవ్వడానికి అర్హులని ఒక జీవో తేవాలని సూచించింది.

ప్రభుత్వ పాఠశాలలో, హాస్టల్స్‌లో అత్యచారాలు, హత్యలు, ఆత్మహత్యలు ఆగాలన్న, ఫుడ్ పాయిజన్ మరణాలు తగ్గాలన్నా ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలు ప్రజా ప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, హస్టళ్లలో చదివించాలని తెలిపింది. ఇద్దరు పిల్లలు ఉంటే ఉద్యోగము, ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో ప్రజాప్రతినిధికి పోటీ చేయవచ్చు అని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జీవో ఏ విధంగా అమలు చేశారో అదే మాదిరిగా ఉద్యోగానికి ప్రజా ప్రతినిధులకు ఆర్హులని జీవో తెచ్చి అమలు చేయాలని చిన్నారి తెలిపింది.

Next Story