కేసీఆర్‌పై ప్రేమను చాటుకున్న చిన్నారి

by velandi.Saikiran |   (  Updated:2026-04-20 17:57:09  IST  )

జగిత్యాల సభ అనంతరం బస్సులో వెళ్తుండగా కేసీఆర్ చిత్రపటాన్ని పట్టుకొని కనిపించిన చిన్నారి వీడియో వైర‌ల్ గా మారింది.

కేసీఆర్‌పై ప్రేమను చాటుకున్న చిన్నారి
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై ప్రేమను చాటుకుంది ఓ చిన్నారి. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ అనంతరం బస్సులో వెళ్తుండగా, కేసీఆర్ చిత్రపటాన్ని పట్టుకొని కనిపించింది. ఇక ఆ చిన్నారిని చూసి బస్సు ఆపి చిత్రపటాన్ని స్వీకరించారు కేసీఆర్‌. అనంత‌రం ఆ చిన్నారిని చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

ఈ వీడియో చూసిన బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు, ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. కాగా జ‌గిత్యాలలో స‌భ పూర్తయిన వెంట‌నే రోడ్డున మార్గ‌న ఎర్ర‌వెల్లికి బ‌య‌లు దేరారు కేసీఆర్‌. సిరిసిల్లా మీదుగా ఫాంహౌజ్ కు వెళ్లారు. ఇది ఇలా ఉండ‌గా, మేం అధికారంలోకి రాగానే హైడ్రా ఎత్తి అవతల పడేస్తామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కేసీఆర్. హైదరాబాద్ లో హైడ్రా, నిజామాబాద్ లో నిడ్రా, జగిత్యాలలో జిడ్రానా? అంటూ ఫైర్ అయ్యారు. తాను సీఎం అయ్యాక‌, అన్ని ర‌ద్దు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

Next Story