- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటర్లకు మస్కా.. నకిలీ వెండి కాయిన్స్ పంచిన అభ్యర్థి!
మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో/ మేడ్చల్: తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ (Telangana Municipal Polls) కొనసాగుతోంది. పలు చోట్ల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా అలియాబాద్ (Aliabad) మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ పార్టీ 5 వ వార్డు అభ్యర్థి మాలతి మాధవరెడ్డి నకిలీ వెండి నాణేలను (Fake silver Coins) పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దశరథ్ ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియాతో దశరథ్ మాట్లాడుతూ ఓటర్లను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఇవాళ తెల్లవారుజామున ఓటర్లకు నకిలీ సిల్వర్ కాయిన్స్ పంపిణీ చేశారని ఆరోపించారు. ఈ ప్రలోభాల విషయంలో ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి మాలతి మాధవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆరోపించారు.






