- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో మరో ఘోరం.. కుక్కల దాడిలో 5 నెలల చిన్నారి మృతి
by GSrikanth |
హైదరాబాద్ షేక్‌పేట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుక్కల దాడిలో ఐదు నెలల పసికందు మృతిచెందింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ షేక్‌పేట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుక్కల దాడిలో ఐదు నెలల పసికందు మృతిచెందింది. 17 రోజుల క్రితం బాలుడి(శరత్)ని గుడిసెలో పడుకోబెట్టి తల్లిదండ్రులు పనికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. దీంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. 17 రోజులుగా ఐసీయూలో మృత్యువుతో పోరాడిన చిన్నారి పరిస్థితి విషమించి ఇవాళ తుదిశ్వాస విడిచారు. షేక్‌పేట్‌లోని వినోభానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు పరిశీలించగా.. వీధికుక్కలు దాడి చేసినట్లు గుర్తించారు.
Next Story






