- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
99 డేస్ యాక్షన్ ప్లాన్.. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తమ రెండేళ్ల పరిపాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు రాబోయే రోజుల్లో ఏం చేయాలనుకుంటోందనేది ప్రజలకు వివరించేందుకు 99 డేస్ యాక్షన్ ప్లాన్ (99 Days Action Plan) పేరుతో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులతో రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమావేశం నిర్వహించి 99 రోజుల యాక్షన్ ప్లాన్‍పై దిశా నిర్దేశం చేయనున్నారు. విభాగాల వారీగా 99 రోజుల యాక్షన్ ప్లాన్‍కు సీఎం తుది ఆమోదం తెలపనున్నారు.
గేమ్ చేంజర్ గా యాక్షన్ ప్లాన్:
మార్చి 2 నుంచి జూన్ 9 వరకు మొత్తం 99 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ లో అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు, అధికారులు, చట్టసభల ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని యోచిస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న వేళ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఈ యాక్షన్ ప్లాన్‍తో ముందుకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. దీంతో ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టడం, క్షేత్రస్థాయిలో తామేం చేస్తున్నామో వివరించడమే లక్ష్యం ప్రభుత్వం ఈ కసరత్తు చేస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యాక్షన్ ప్లాన్ ఓ గేమ్ చేంజర్ గా మారబోతోందా అనేది వేచి చూడాలి.






