- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Crypto Fraud : క్రిప్టో కరెన్సీ పేరుతో 95కోట్ల టోకరా!
క్రిఫ్టో కరెన్సీ(Crypto Currency)పేరుతో 95కోట్ల ఘరానా మోసం(Fraud) సంచలనం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : క్రిఫ్టో కరెన్సీ(Crypto Currency)పేరుతో 95కోట్ల ఘరానా మోసం(Fraud) సంచలనం రేపింది. ఆన్ లైన్ మోసాలు..సైబర్ నేరాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నప్పటికి అధిక లాభాల ఆశల గాలానికి అత్యశపరులు..అమాయకులు చిక్కుతునే ఉన్నారు. క్రిప్టో కరెన్సీ పెట్టుబడులతో అత్యధిక లాభాలు అంటూ వాట్సాప్ గ్రూపుల ద్వారా సాగించిన ప్రచారంతో 43మందికి పైగా బాధితులను నిందితుడు 95కోట్ల మేరకు మోసం చేశాడు.
కరీంనగర్ కు చెందిన బాధితుడు అర్ర మనోజ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన నిందితుడు కుర్రిమాల రమేష్ గౌడ్ జీబీఆర్ పేరుతో కొత్త నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి అధిక పెట్టుబడుల లాభాలు అంటూ చాలా కుటుంబాల నుండి కోట్లు వసూలు చేసినట్లుగా గుర్తించారు.
పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయంటూ జీబీఆర్(GBR)నకిలీ వెబ్ సైట్ తో మోసానికి పాల్పడిన నిందితుడు రమేష్ పై హైదరాబాద్ సీఐడీ పోలీసు(CID Police)లు కేసు నమోదు చేశారు. నిందితుడిపై 420, 120-B IPC కింద సీఐడీ పోలీసులు కేసునమోదు చేశారు. సీఐడీ పోలీసులు నిందితుడు రమేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.






