- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోరుట్ల వ్యవసాయ కాలేజి 93 మంది విద్యార్దులు పోలాస కళాశాలకు బదిలీ
మూడేళ్ల క్రితం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో ఏర్పాటైన కోరుట్ల వ్యవసాయ కళాశాలకు చెందిన 93 మంది విద్యార్థులను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పొలాస వ్యవసాయ కళాశాలకు బదిలీ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మూడేళ్ల క్రితం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో ఏర్పాటైన కోరుట్ల వ్యవసాయ కళాశాలకు చెందిన 93 మంది విద్యార్థులను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పొలాస వ్యవసాయ కళాశాలకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా కోరుట్ల విద్యార్థులని పొలాస కళాశాల విద్యార్థినిలు గులాబీ పూలు అందించి ఆత్మీయంగా స్వాగతించారు. కళాశాల బోధన సిబ్బంది పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ ఝాన్సీ రాణి, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ చల్లా వేణు గోపాల రెడ్డి, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ భారతీ నారాయణ భట్, అదనపు కార్యదర్శి కిరణ్మయి, సంయుక్త కార్యదర్శి శర్మ పాల్గొన్ని కోరుట్ల కళాశాల విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఉన్నత చదువులు చదవి దేశానికి మంచి పేరు తేవాలని సూచించారు.
బదిలీ ప్రక్రియను అగ్రికల్చర్యూనివర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య విద్యార్దులపై సమస్యలపై కసరత్తు చేసి సీఎం రేవంత్‌రెడ్డికి కోరుట్ల విద్యార్థుల భవిష్యత్తు కోసం వారిని తమ విశ్వవిద్యాలయం పరిధిలోకి బదిలీ చేయాలని సూచించారు. అంతటితో ఆగకుండా కార్యదర్శి డాక్టర్ అలుగు వర్షిణితో అనేక దఫాలుగా చర్చించడంతో పాటు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అనేక దఫాలుగా సమావేశమై అన్ని కోణాల నుంచి వివిధ అంశాలను పరిశీలించింది. విద్యార్థుల బదిలీకి విధి విధానాల్ని రూపొందించి ఒక నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా యూనివర్శిటీ అకడమిక్ కౌన్సిల్, ఫ్యాకల్టీ బోర్డు, పాలకమండలి లు కోరుట్ల కళాశాల విద్యార్థులని బదిలీ చేయడానికి ఆమోదం తెలిపాయి. గత పాలకుల తప్పడు నిర్ణయాలతో అగమ్యగోచరం అయిన 93 మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపట్టారు.






