అడవిలో 10 గంటలు చిక్కుకున్న 80 మంది పర్యాటకులు.. తర్వాత ఏం జరిగిందంటే? (వీడియో)

by Disha Web Desk 4 |
అడవిలో 10 గంటలు చిక్కుకున్న 80 మంది పర్యాటకులు.. తర్వాత ఏం జరిగిందంటే? (వీడియో)
X

దిశ, ఏటూరునాగారం : బుధవారం ములుగు జిల్లా నూగురు వెంక‌ట‌పురం మండ‌లం వీర‌భ‌ద్రరం గ్రామ‌ అట‌వీ ప్రాంతంలో ఉన్న ముత్యం దారా జ‌ల‌పాతాన్ని చూడడానికి 80 మంది ప‌ర్యాటకులు వెళ్లారు. తిరిగి వ‌స్తున్న స‌మ‌యంలో భారీ వ‌ర్షం కార‌ణంగా మార్గ మ‌ధ్యలో గ‌ల మామిడి గండి వాగు పోంగి పోర్లుతుండ‌డంతో అడ‌విలో చిక్కుకుపోయారు. కాగా చిక్కుకుపోయిన వారి కోసం బుద‌వారం సాయంత్రం నుండి పోలీసులు, జిల్లా డిజాస్టార్ రెస్పాన్స్ ఫోర్స్‌, ఏన్డీఆర్ఏఫ్ సిబ్బంది గాలింపు చ‌ర్యలు చేప‌ట్టారు.

అడ‌వి మ‌ధ్యలో చిక్కుకు పోయిన వారిలో ఒక వ్యక్తి ఫోన్ ద్వారా స‌మాచారాన్ని 100 నెంబ‌ర్‌కి ఫోన్ చేసి తెలిపారు. విష‌యం తెలుసుకున్న జిల్లా ఏస్పీ హూటాహూటిన వెంక‌టాపురం సీఐ, ఏస్సై పోలీసు సిబ్బంది, ఏన్‌డిఆర్ఏఫ్ సిబ్బంది గాలింపు చ‌ర్యలు చేప‌ట్టారు. రాత్రి 12 గంట‌ల స‌మయంలో ఘ‌ట‌న స్తలానికి ములుగు జిల్లా ఏస్పీ గౌష్ అలాం, ఏటూరునాగారం ఏఏస్పీ సీరిశేట్టి సంకీర్త్ చేరుకొని గాలింపు చ‌ర్యలు ముమ్మరం చేసారు.

అర్ధరాత్రి 2 గంట‌ల స‌మయంలో వారి అచూకీ తెలియ‌గా ఏన్టీఆర్ఏఫ్ బృందం సాయంతో ప‌ర్యాటకుల‌ను ఒడ్డుకు తీసుకు వచ్చారు. ఒడ్డుకు చేరుకున్న వారిలోన అనారోగ్యంగా ఉన్న వారికి వెంక‌టాపురం వైద్య సిబ్బంది చికిత్స అందించారు. కాగా జ‌ల‌పాతాన్ని చూడడానికి వెళ్లిన ప‌ర్యాటకులు ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్‌, హ‌న్మకొండ, వరంగ‌ల్‌కు చెందిన‌వారు అని తెలిసింది.

అడ‌విలో 10 గంట‌లు..

అడ‌విలో చిక్కుకుపోయిన వారు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల స‌మయంలో జ‌ల‌పాతం చూడడానికి వెళ్లి వ‌స్తుండ‌గా సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో వాగు ఒక్క సారిగా పొంగింది. దీంతో అడ‌విలో సుమారు 10 గంట‌లు వేచి ఉన్నామ‌ని తెలిపారు. ఈ స‌మ‌యంలోనే ఒక వ్యక్తికి తేలు కుట్టింద‌ని వారు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed