- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రానికి 80 మెగావాట్ల సోలార్ రూఫ్ టాప్ యూనిట్ల మంజూరు
రాష్ట్రానికి 40 వేల ఉచిత సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

- కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అభ్యర్థన మేరకు మంజూరు చేశామన్న కేంద్రం
- పైసా పెట్టుబడి లేకుండానే 40 వేల మంది లబ్దిదారులకు సోలార్ రూఫ్ టాప్ యూనిట్లు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి 40 వేల ఉచిత సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్కటి 2 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఈ రూఫ్ టాప్ యూనిట్ల ద్వారా రాష్ట్రంలో 80వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకం కింద రాష్ట్రానికి ఈ ఉచిత సోలార్ రూఫ్ టాప్ లను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్ట్రానికి ఈ మేరకు సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను మంజూరు చేయాలని ఈ నెల 29న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాసిన వెంటనే స్పందించారు. తెలంగాణలో సౌర విద్యుత్ పెంపునకు, పేదలకు ఈ సోలార్ యూనిట్లను అందించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నాన్ని ఈ సందర్భంగా జోషి అభినందించారు. తెలంగాణకు మొదటి దశలో 20వేల యూనిట్లను ప్రస్తుతం అందచేయనున్నట్లు వెల్లడించారు. మిగతా 20 వేల యూనిట్లను రెండో దశలో కేటాయిస్తామన్నారు. ఈ పథకం కింద వినియోగదారులు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని... మొదటి రోజు నుంచే ఆ సోలార్ ఆస్తులకు యజమానులు అవుతారని ప్రహ్లోద్ జోషి వెల్లడించారు. రాష్ట్రంలో సోలార్ రూఫ్ టాప్ లను తెలంగాణ స్టేట్ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీరెడ్కో) అమలు చేసే ఏజెన్సీగా ఉంటుందన్నారు. సామూహికంగా సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసే విధానం (యుటిలిటీ లెడ్ అగ్రిగేషన్)లో భాగంగా కేంద్రం ఈ యూనిట్లను అందిస్తోంది. రాష్ట్రానికి 40వేల సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను తీసుకురావడంలో కిషన్ రెడ్డి పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు.






