షాకింగ్.. మటన్ తిని 8 మందికి అస్వస్థత, ఒకరు మృతి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-22 14:00:55  IST  )

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వ‌ణ‌స్థ‌లిపురంలో మటన్ తిని 8 మంది అస్వస్థతకు గురవ్వగా ఒకరు మృతి చెందారు.

షాకింగ్.. మటన్ తిని 8 మందికి అస్వస్థత, ఒకరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వ‌ణ‌స్థ‌లిపురంలోని ఆర్టీసి కాలనీలో మటన్ తిని 8 మంది అస్వస్థతకు గురవ్వగా ఒకరు మృతి చెందారు. మృతి చెందిన వ్య‌క్తి శ్రీనివాస్ కాగా ఆయ‌న‌ ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నారు. నిల్వ చేసిన మ‌ట‌న్ తిన‌డం వ‌ల్ల‌నే అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్టు తెలుస్తోంది. బోనాల సందర్భంగా ఆదివారం మటన్ తెచ్చుకుని తినగా మిగిలిన దానిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని మరుసటిరోజు తినడంతో ఫుడ్ పాయిజన్ అయినట్టు సమాచారం. ఇక ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో 8 మంది చికిత్స పొందుతుండ‌గా వారిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story