79వ స్వాతంత్య్ర దినోత్సవం.. గోల్కొండపై త్రివర్ణ పతాకం ఎగురువేసిన CM రేవంత్ రెడ్డి

by Kema Shiva Kumar |

79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని గోల్కొండలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

79వ స్వాతంత్య్ర దినోత్సవం.. గోల్కొండపై త్రివర్ణ పతాకం ఎగురువేసిన CM రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని గోల్కొండలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అంతకు ముందు అయన పోలీసు బలగాలు కవాతు నిర్వహించగా సీఎం గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు హాజరయ్యారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన 25 మందికి పతకాలు ప్రదానం చేయనున్నారు. సౌత్‌వెస్ట్‌ జోన్‌ డీసీపీ చంద్రమోహన్, ఏసీపీ సయ్యద్‌ ఫయాజ్‌ గోల్కొండ కోటలో బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కాసేపట్లో సీఎం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Next Story