బిగ్ రిలీఫ్‌.. రాష్ట్రంలో కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు

by velandi.Saikiran |   (  Updated:2026-04-17 01:10:58  IST  )

కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ జరిగింది సర్కార్.

బిగ్ రిలీఫ్‌.. రాష్ట్రంలో కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ జరిగింది సర్కార్. వీటి ద్వారా ఆద‌నంగా 416 బెడ్లు అందుబాటులోకి రాబోతున్నాయన్నమాట. దీంతో కిడ్నీ బాధితులకు రిలీఫ్ దక్కనుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 102 డయాలసిస్ సెంటర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో 15,600 మంది పేషెంట్లు సేవలు పొందుతున్నారు. మరొక వైపు 67 పాత సెంటర్లలో వెయిటింగ్ టైం తగ్గించేందుకుగాను కొత్తగా 155 మెషీన్లు ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు 79 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది.

Next Story