TG: గుడ్ న్యూస్.. రాష్ట్రానికి కొత్తగా 75 పీజీ మెడికల్ సీట్లు

by Prasad Jukanti |   (  Updated:2025-11-02 09:17:25  IST  )

తెలంగాణలో అదనంగా మరో 75 పీజీ మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

TG: గుడ్ న్యూస్.. రాష్ట్రానికి కొత్తగా 75 పీజీ మెడికల్ సీట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : పీజీ వైద్య విద్య సీట్ల భర్తీ విషయంలో వైద్య ఆరోగ్యశాఖ మరో తీపి కబురు వెల్లడించింది. 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మరో 75 పీజీ సీట్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కొత్త మెడికల్ కాలేజీల్లోనూ పీజీ సీట్లు కేటాయించామని తెలంగాణ వైద్యారోగ్య శాఖ తాజాగా అధికారిక నోట్ విడుదల చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు మెరుగుపడడంతో 7 కాలేజీల్లో పీజీ సీట్లకు ఎన్‌ఎంసీ ఓకే చెప్పింది. దీంతో మొత్తం 75 సీట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు స్వీకరించనున్నారు. అదనపు సీట్ల రాకతో ఆస్పత్రుల్లో మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Next Story