TG: మున్సిపల్ ఎన్నికల్లో 73.03 శాతం పోలింగ్ నమోదు

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-11 15:55:42  IST  )

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

TG: మున్సిపల్ ఎన్నికల్లో 73.03 శాతం పోలింగ్ నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు(Telangana Municipal Elections) ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు మినహా.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. సాయంత్ర ఐదు గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియగా.. క్యూలో నిల్చున్న వారికి 7 గంటల వరకూ అవకాశం ఇచ్చారు. మొత్తం మున్సిపల్ ఎన్నికల్లో 73.01 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఏడు కార్పొరేషన్లలో 66.05 శాతం పోలింగ్ నమోదవగా.. 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా చౌటుప్పల్‌లో 91.91 శాతం నమోదవగా.. అత్యల్పంగా 59.68 శాతం నందికొండ మున్సిపాలిటీలో నమోదైంది.

ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడంలో పోలీసు సిబ్బంది అంకితభావంతో పాటు ఈ ఆధునిక వెబ్‌కాస్టింగ్ సాంకేతికత ఎంతగానో తోడ్పడిందని డీజీపీ శివధర్ రెడ్డి ప్రశంసించారు. ఈ ఎన్నికల కోసం తెలంగాణ పోలీసులు అత్యంత పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారని డీజీపీ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,203 పోలింగ్ స్టేషన్లను కవర్ చేస్తూ భారీ ఎత్తున భద్రతను కల్పించామన్నారు. 1,302 అత్యంత సమస్యాత్మక (హైపర్ సెన్సిటివ్), 1,926 సమస్యాత్మక (సెన్సిటివ్) మరియు 4,975 సాధారణ కేంద్రాలుగా గుర్తించి, ఆయా ప్రాంతాల తీవ్రతను బట్టి బలగాలను మోహరించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వృద్ధులు ఓట్లు వేసేందుకు పోలీస్ సిబ్బంది సహాయం చేశారని డీజీపీ పేర్కొన్నారు.

Next Story