- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
72 గంటల నిరాహార దీక్ష.. జిల్లా కేంద్రాలకు బయల్దేరిన బీసీ చైతన్య రథాలు
బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు 4న ఉదయం 11 నుంచి 7వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బీసీ బిల్లుల సాకారం కోసం ఎమ్మెల్సీ కవిత చేపట్టబోయే 72 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా బీసీ చైతన్య రథాలు జిల్లా కేంద్రాలకు బయలుదేరాయి. ఈ మేరకు ఆ చైతన్య రథాలను ఇవాళ ఆమె ఉదయం బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివశంకర్, కో-ఆర్డినేటర్ ఆలకుంట హరి, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, తదితరులు పాల్గొన్నారు.






