- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ అడవుల్లో 60 కొత్త సీతాకోక చిలుక జాతులు గుర్తింపు
తెలంగాణలోని ములుగు జిల్లా అడవుల్లో కొత్త జీవ వైవిధ్య సంపద వెలుగులోకి వచ్చింది. లక్నవరం, తాడ్వాయి, పస్రా అడవుల్లో నిర్వహించిన ప్రత్యేక సర్వేలో మొత్తం 60 రకాల కొత్త సీతాకోక చిలుక జాతులు గుర్తించబడి నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ములుగు జిల్లా అడవుల్లో కొత్త జీవ వైవిధ్య సంపద వెలుగులోకి వచ్చింది. లక్నవరం, తాడ్వాయి, పస్రా అడవుల్లో నిర్వహించిన ప్రత్యేక సర్వేలో మొత్తం 60 రకాల కొత్త సీతాకోక చిలుక జాతులు గుర్తించబడి నట్లు తెలుస్తోంది. ఈ సర్వేలో దేశంలోని 8 రాష్ట్రాల వైల్డ్‌లైఫ్ విభాగాలు, వరల్డ్ వైల్డ్ ఫర్ నేచర్ (WWF) సంస్థల నిపుణులు పాల్గొన్నారు. మొత్తం 60 మంది పరిశోధకులు మూడు రోజుల పాటు ములుగు అడవుల్లో పర్యటించి సీతాకోక చిలుకల వివిధ జాతులను గుర్తించారు. ఈ సర్వేలో బయటపడ్డ కొత్త జాతులు తెలంగాణ జీవ వైవిధ్యానికి కొత్త అందాన్ని తెస్తాయని నిపుణులు పేర్కొన్నారు. జిల్లాలో ఇంత పెద్ద స్థాయిలో సీతాకోక చిలుకల జాతులు గుర్తించబడటం ఇదే మొదటిసారి అని స్థానిక రేంజర్ నరేందర్ తెలిపారు. ఈ పరిశోధనతో ములుగు జిల్లా పేరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుందనే నమ్మకం వారు వ్యక్తం చేశారు.






