- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువకుల గల్లంతు..మేడిగడ్డ బ్యారేజీ వద్ద కొనసాగుతున్న సహాయకచర్యలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరిలో శనివారం ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు అంబటిపల్లికి చెందిన యువకులుగా గుర్తించారు.

దిశ, వెబ్ డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరిలో శనివారం ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు అంబటిపల్లికి చెందిన యువకులుగా గుర్తించారు. ఈత కోసం వెళ్లి సెల్ఫీలు దిగుతూ యువకులు గల్లంతవ్వగా వారిలో ఒకరిని గజ ఈతగాళ్లు కాపాడారు. మిగితా ఆరుగురు యువకులు మధుసూదన్ (18), శివ మనోజ్ (15), రక్షిత్ (13), సాగర్ ( 16), పండు (18) రాహుల్ (19) కాగా వారిలో రక్షిత్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఇక మిగిలిన ఐదుగురు యువకుల కోసం బ్యారేజీ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొడుకుల ఆచూకీ లభ్యం అవ్వకపోవడంతో తల్లిదండ్రులు రాత్రంతా గోదావరి ఒడ్డుపైనే కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కలెక్టర్, ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.






