- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేగంగా కొనసాగుతున్న ఎన్నికలు.. ఉదయం 11 గంటలకు 57.91 శాతం పోలింగ్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుది విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుది విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొత్తం 182 మండలాల్లోని 3,752 గ్రామాల్లో ఈ మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా. 12, 652 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 53,06,401 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 వరకు మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉండటంతో గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద మొత్తంలో తరలి వస్తున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. 9 గంటల వరకు 23.5 శాతం పోలింగ్ నమోదైంది. అనంతరం 11 గంటలకు 57.91 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. మరో రెండు గంటల సమయం ఉండటంతో పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.






