మాస్టర్ అథ్లెట్ల విజయాలు యువతకు ఆదర్శం

by Disha Web Desk 7 |
మాస్టర్ అథ్లెట్ల విజయాలు యువతకు ఆదర్శం
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాస్టర్‌ అథ్లెట్లు వయస్సును లెక్క చేయకుండా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం అభినందనీయమని, వీరి విజయాలు యువ క్రీడాకారులకు ఆదర్శనీయమని శాట్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయగౌడ్‌ అన్నారు. హర్యానాలోని కురుక్షేత్రలో ఈ నెల 16 నుంచి 19 వరకు జరిగిన నేషనల్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘4వ జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌’లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించిన మాస్టర్‌ అథ్లెట్లను సోమవారం ఎల్‌బీ స్టేడియంలోని శాట్స్‌ కార్యాలయంలో సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో కూడా క్రీడల్లో పాల్గొని రాష్ట్రానికి పతకాలు సాధించడం గర్వకారణమని.. భవిష్యత్‌ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తాయన్నారు. రాష్ట్రం నుంచి 165 మంది అథ్లెట్లు పాల్గొని 90 మెడల్స్‌ (25-గోల్డ్‌, 37-సిల్వర్‌, 28-బ్రాంజ్‌) సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మర్రి లక్ష్మా రెడ్డి, కార్యదర్శి ప్రభుకుమార్‌ గౌడ్‌, కోశాధికారి డి. లక్ష్మి, యు.కళ్యాణి, రాజరాజేశ్వరి, పద్మిని, ఎం.ఆర్‌.పి బాబు, శ్రీహరి, లక్ష్మీసరళ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed