బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత రైల్ రోకో

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-28 08:31:44  IST  )

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కామారెడ్డి పట్టణంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తమ కార్యకర్తలతో కలిసి రైల్ రోకో నిర్వహించారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత రైల్ రోకో
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కామారెడ్డి పట్టణంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తమ కార్యకర్తలతో కలిసి రైల్ రోకో నిర్వహించారు. అనంతరం వారు ట్రాక్‌పై కూర్చొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు అప్రమత్తమైన కామారెడ్డి పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి జాగృతి నేతలను అక్కడ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. “బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17 శాతం రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం దారుణం” అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని కవిత ఆరోపించారు.

Next Story