- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.4.12 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన విప్ గంప
దేవునిపల్లిలో రూ.4 కోట్ల 12 లక్షల నిధులతో చేపట్టే పనులకు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రారంభించారు.

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో రూ.4 కోట్ల 12 లక్షల నిధులతో చేపట్టే పనులకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఈ నిధులతో రోడ్డు విస్తరణ, డివైడర్ పనులు, సెంట్రల్ లైటింగ్ వంటి అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి వెంకటి, వైస్ చైర్మన్ కుంబాల రవి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు కాసర్ల గోదావరి స్వామి, పోలీసు క్రిష్ణాజీరావు, ఉరుదొండ వనిత రవి, మాజీ సర్పంచ్ నిట్టు వెంకట్రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల రవీందర్, రైతు సమన్వయ సమితి కన్వీనర్ నిట్టు లింగారావు తదితరులు పాల్గొన్నారు.






