- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
4KGS GOLD THEFT: చాయ్ తాగుదామని బస్సు దిగితే.. బంగారం గయాబ్
by Ramesh Naini |
దాబా వద్ద ఓ బస్సు ఆగింది. చాయ్ తాగుదామని బస్సు దిగితే బంగారం ఎత్తుకెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: దాబా వద్ద ఓ బస్సు ఆగింది. చాయ్ తాగుదామని బస్సు దిగితే బంగారం ఎత్తుకెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్తున్న బంగారం వ్యాపారి నుంచి భారీగా బంగారం దొంగిలించారు. జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ట్రావెల్స్ బస్సులో దుండగులు చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి దాబా వద్ద బస్సు ఆగిన సమయంలో ట్రావెల్స్ బస్సులో చోరీ చేసినట్లు సమాచారం.
బాధితుడు చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించగా జహిరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాబాలోని సీసీటీవీ కెమెరా లో నమోదైన చోరీ ఘటన దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. దీంతో సీసీ కెమెరా రికార్డులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అనుమానితులుగా గుర్తించి.. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
Next Story






