- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్తర డిస్కంలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌పై NPDCL సీఎండీ గోపాల్ రావు క్లారిటీ
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్‌లో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసినట్లు వచ్చిన ప్రకటనలపై ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు క్లారిటీ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్‌లో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసినట్లు వచ్చిన ప్రకటనలపై ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు క్లారిటీ ఇచ్చారు. ఉత్తర డిస్కం పరిధిలో ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని, కానీ 3898 జేఎల్ పోస్టులు, 68 ఏఈఈ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోందని తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు.
ఇది పూర్తిగా తప్పుడు నోటిఫికేషన్ అని ఆయన క్లారిటీ ఇచ్చారు. టీఎస్ ఎస్పీడీసీఎల్ ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదన్నారు. ఎన్పీడీసీఎల్‌లో ఏ నోటిఫికేషన్ జారీ చేసినా నోటిఫికేషన్ కంపెనీ వెబ్‌సైట్‌లో పెడతామని, నిరుద్యోగులు ఇలాంటి తప్పుడు ప్రకటనలు చూసి మోసపోవద్దని ఆయన సూచించారు. నిరుద్యోగులు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లోని కెరియర్స్‌లో నోటిఫికేషన్లను చూసి నివృత్తి చేసుకోవాలని సీఎండీ సూచించారు. వివరాలకు www.tsnpdcl.in ను సందర్శించాలని పేర్కొన్నారు.






