- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూ ఇయర్ జోరు తగ్గలే..! స్పెషల్ డ్రైవ్‌లో మరో 327 మందుబాబులపై కేసులు
న్యూ ఇయర్ వేడుకల జోరు ఇంకా తగ్గినట్టు లేదు.. జనవరి ఫస్ట్ తర్వాత కూడా చాలా మంది మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: న్యూ ఇయర్ వేడుకల జోరు ఇంకా తగ్గినట్టు లేదు.. జనవరి ఫస్ట్ తర్వాత కూడా చాలా మంది మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. నగరంలో రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా జనవరి 2, 3 తేదీల్లో (2026) నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 327 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పట్టుబడిన వారిలో అత్యధికంగా 263 మంది ద్విచక్ర వాహనదారులు (Bikers) ఉండగా, 25 మంది ఆటో డ్రైవర్లు, 39 మంది కార్లు, ఇతర వాహన చోదకులు ఉన్నారు.
బీఏసీ (BAC) పాయింట్ల వారీగా నమోదైన కేసులు:
30-50: 66 కేసులు
51-100: 131 కేసులు
101-150: 61 కేసులు
151-200: 35 కేసులు
201-250: 22 కేసులు
251-300: 06 కేసులు
300 పైన: 06 కేసులు
మద్యం తాగి వాహనాలు నడిపేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని (Zero Tolerance), ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.






