- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఆ జోన్‍లో అత్యధికంగా కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు (Jubilee Hills by-election) పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జాయింట్ సీపీ తఫ్సిర్ ఇక్బాల్ అన్నారు. 1761 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారని నాన్ లోకల్స్ అందరినీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బయటకు పంపిస్తామన్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ లో ఉందని ఎలాంటి అవాంచిత ఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది రెడీగా ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు ప్రజాస్వామ్య పండగలో పాల్గొని స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద 27 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు అయినట్లు తెలిపారు. వీటిలో ఫిల్మ్ నగర్ జోన్ లో 6, బంజారాహిల్స్ లో 1, బోరబండలో 7, జూబ్లీహిల్స్ 3, మధురనగర్ లో 6, టౌలీచౌకిలో 2, సనత్ నగర్ లో 2 రెండు కేసులు నమోదు అయినట్లు చెప్పారు.






