- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాలరు వలకు చిక్కిన 25 కేజీల చేప.. ధరెంత పలికిందో తెలుసా?
తాజాగా లోయర్ మానేరు డ్యామ్ వద్ద చేపల వేటకు వెళ్లిన జాలరు వలకు భారీ చేప చిక్కింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో జురుగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులు నిండుతున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మత్స్యకారుల వలలకు భారీ సంఖ్యలో చేపలు చిక్కుతున్నాయి. ఒక్కోసారి ఊహించని రీతిలో భారీ చేపలు వలకు చిక్కుతుండగా.. జాలర్ల పంట పండుతోంది. తాజాగా లోయర్ మానేరు డ్యామ్ వద్ద చేపల వేటకు వెళ్లిన జాలరు వలకు భారీ చేప చిక్కింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సంగంపల్లి గ్రామానికి చెందిన కూన సంపత్ లోయర్ మానేరు డ్యామ్ లో చేపల వేటకు వెళ్లాడు. భారీవర్షాల నేపథ్యంలో డ్యామ్ నుంచి ఇటీవల భారీగా వరదనీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక రకాల చేపలు వరద ప్రవాహంలో కొట్టుకు వచ్చాయి. చేపలవేటకు వెళ్లిన సంపత్ వలకు పాతిక కేజీల భారీ చేప వలకు చిక్కింది. వలను పైకి లాగే క్రమంలో బరువు ఎక్కువగా ఉండటంతో ఎంతో ఆసక్తిగా దానిని బయటికి తీసి చూడగా.. బొచ్చె చేప కనిపించింది. ఇంకేముంది సంపత్ ఆనందానికి అవధుల్లేవు. ఆ చేపను విక్రయానికి పెట్టగా.. పక్క ఊరికి చెందిన ఓ వ్యక్తి రూ.3500కు కొనుగోలు చేసి తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.






