మున్సిపల్ మార్కెట్లకు రూ.25 కోట్లు.. మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ

by Kema Shiva Kumar |

తెలంగాణ మున్సిపల్ మార్కెట్ల నిర్మాణానికి రూ.25 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మున్సిపల్ మార్కెట్లకు రూ.25 కోట్లు.. మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులో భాగంగానే మున్సిపల్ మార్కెట్ల నిర్మాణానికి రూ.25 కోట్లకు పరిపాలన మంజూరు ఇస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2026-27 బడ్జెట్‌లో మున్సిపల్ మార్కెట్ల నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో గతంలో రూ.2.87 కోట్లకు పరిపాలన మంజూరు ఇచ్చిన మున్సిపల్ శాఖ మరోసారి రూ.25 కోట్లకు ఇచ్చింది. మరో రూ.72.12 కోట్లకు పరిపాలన మంజూరు ఇవ్వాల్సి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జీవీఆర్ఆర్ ప్రసాద్‌కు ప్రమోషన్..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డవలప్ మెంట్ ఆథారిటీ(హెచ్ఎండీఏ)లో ఏపీఓగా పనిచేస్తున్న జీవీఆర్ఆర్ ప్రసాద్‌కు ప్లానింగ్ ఆఫీసర్ (PO)‌గా ప్రమోషన్ ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ ఇవాళ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టును ప్రసాద్‌కు కేటాయించనున్నారు.

Next Story