ప్రజాభవన్ కు 2008 డీఎస్సీ బాధితులు.. ఆదుకోవాలని ఆందోళన

by Kema Shiva Kumar |

ఉద్యోగాలు ఇచ్చి తమను ఆదుకోవాలని కోరుతూ.. 2008 డీఎస్సీ బాధితులు మంగళవారం ప్రజాభవన్‌ను ముట్టడించారు.

ప్రజాభవన్ కు 2008 డీఎస్సీ బాధితులు.. ఆదుకోవాలని ఆందోళన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగాలు ఇచ్చి తమను ఆదుకోవాలని కోరుతూ.. 2008 డీఎస్సీ బాధితులు మంగళవారం ప్రజాభవన్‌ను ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని రాష్టం నలుమూలల నుంచి 300 మంది పైగా డీఎస్సీ బాధితులు ప్రజాభవన్‌కు చేరుకున్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఇదే విషయంపై గతంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా తమకు హామీ ఇచ్చారని బాధితులు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన నెలల లోపే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి జీవితాల్లో వెలుగు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం, 2008 డీఎస్సీకి చెందిన వెయ్యి మంది బాధితుల జీవితాల్లో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేశారు. 15 ఏళ్ల కన్నీళ్లను తుడవాలని బాధితులు కోరుతున్నారు. ఏళ్లుగా నాన్చుతున్న తమ సమస్యపై సీఎం రేవంత్ స్పందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story