ఓఆర్ఆర్ పై 200 స్పీడ్ థ్రిల్.. చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కైన యువకుడు!

by Ramesh Naini |

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై అత్యంత వేగంగా కారు నడుపుతూ తోటి వాహనదారులను భయాందోళనలకు గురిచేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.

ఓఆర్ఆర్ పై 200 స్పీడ్ థ్రిల్.. చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కైన యువకుడు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై అత్యంత వేగంగా కారు నడుపుతూ తోటి వాహనదారులను భయాందోళనలకు గురిచేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకి వెళితే.. కొత్తపల్లి యశ్వంత్ రెడ్డి అనే యువకుడు ఇటీవల ఓ కొత్త వోక్స్ వాగన్ కారును కొనుగోలు చేశాడు. దాని స్పీడ్ ను టెస్ట్ చేసే నెపంతో ఓఆర్ఆర్ పై ఏకంగా 200 కిలోమీటర్ల వేగంతో కారును నడుపుతూ విన్యాసాలు చేశాడు. పైగా ఈ తతంగాన్ని అంతా ఫోన్‌లో వీడియో తీసి, ఏదో ఘనకార్యం సాధించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

రంగంలోకి దిగిన పోలీసులు.. పోలీసుల హెచ్చరిక

ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. యశ్వంత్ రెడ్డిని గుర్తించి అరెస్టు చేయడమే కాకుండా, అతని కారును సీజ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై మితిమీరిన వేగంతో ప్రయాణించడం, రేసింగ్‌లు నిర్వహించడం, స్టంట్స్ లాంటివి చేస్తే ఉపేక్షించేది లేదని, ఇలాంటి వారికి కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా వాహనదారులను హెచ్చరించారు.

Next Story