HYD: నగరంలో వీధి కుక్కల హల్‌చల్.. ఇవాళ ఒక్కరోజే 20 మంది ఆస్పత్రి పాలు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో వీధికుక్కల(Stray Dogs) దాడులు ఆగటం లేదు. ఎక్కడో ఓ చోట వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి.

HYD: నగరంలో వీధి కుక్కల హల్‌చల్.. ఇవాళ ఒక్కరోజే 20 మంది ఆస్పత్రి పాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వీధికుక్కల(Stray Dogs) దాడులు ఆగటం లేదు. ఎక్కడో ఓ చోట వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. కుక్కల భయానికి ప్రజలు ప్రజలు రోడ్లపైకి రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. వీధుల్లో ఒంటరిగా నడవటానికి హడలిపోతున్నారు. తాజాగా.. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల(Jeedimetla), బాలానగర్(Balanagar) పరిధిలోని పలు కాలనీలు, బస్తీల్లో వీధి కుక్కలు ప్రజలను తీవ్రంగా భయపెట్టాయి. ఆదివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో జీహెచ్ఎంసీ (GHMC) మహిళా కార్మికులు విధులు నిర్వర్తిస్తుండగా కుక్కల గుంపు దాడి చేసి పలువురిని గాయపరిచాయి. ఇవాళ ఒక్కరోజే ఈ ప్రాంతంలో దాదాపు 20 మందిపై వీధి కుక్కలు దాడి చేసినట్లు తెలుస్తోంది. బాధితులంతా సమీప ఆస్పత్రిలో చేరారు. ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, మహిళలు ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి కుక్కలని పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story