- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో హైడ్రా యాక్షన్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజల సంబురాలు
తెలంగాణ ప్రభుత్వం చెరువులు ప్రైవేటు, ప్రభుత్వ భూముల కబ్జాలను, కబ్జాదారుల చెర నుంచి విముక్తి చేయడానికి ప్రతిష్టాత్మకంగా హైడ్రాని ప్రారంభించింది.

దిశ, కొత్తగూడెం : తెలంగాణ ప్రభుత్వం చెరువులు ప్రైవేటు, ప్రభుత్వ భూముల కబ్జాలను, కబ్జాదారుల చెర నుంచి విముక్తి చేయడానికి ప్రతిష్టాత్మకంగా హైడ్రాని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఘట్కేసర్ మండలం, నారపల్లిలోని కాచివాని సింగారం గ్రామంలో సింగరేణి దివ్య నగర్ లేఅవుట్ చుట్టూ సుమారు నాలుగు కిలోమీటర్ల ప్రహరీని హైడ్రా అధికారులు కూల్చివేశారు. 18 ఏళ్ల తమ పోరాటానికి విముక్తి కలిగిందని హర్షం వ్యక్తం చేస్తూ కందిమల్ల ప్రసాద్ అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ సమీపంలో సీఎం రేవంత్ రెడ్డికి ,హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ బ్యానర్ను ఏర్పాటు చేశారు.
ఈ అంశంపై ప్రసాద్ ను పలకరించగా 1990 సంవత్సరంలో సింగరేణి కార్మికులు సుమారు 1800 మంది దివ్య నగర్ లో ప్లాట్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు. అప్పటినుండి ప్లాట్లు అమ్మిన నల్ల మల్లారెడ్డి తమని వేధిస్తూనే ఉన్నాడని, తమ ప్లాట్ల చుట్టూ నాలుగు కిలోమీటర్ల ప్రహరీ కట్టి ఇబ్బందులకు గురి చేశాడని తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి ఫిర్యాదు చేశామని, పది రోజుల క్రితం హైడ్రా కార్యాలయంలో రంగనాథ్‌ని కలిసి తమ గోడు తెలుపగా ఆయన అక్రమ ప్రహరీని కూల్చివేశారని సంతోషం వ్యక్తం చేశారు. 2008 సంవత్సరం నుండి చేస్తున్న తమ పోరాటానికి ఏ ప్రభుత్వం స్పందించలేదని, హైడ్రా అధికారుల చొరవతోనే తమ ప్లాట్లు తమకు తిరిగి లభించాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ రుణం తీర్చుకోలేమని ఉద్వేగానికి లోనయ్యారు.






