- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాసర ఫస్ట్ ఫేజ్‌లో 1,690 సీట్లు కేటాయింపు
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) బాసర, మహబూబ్ నగర్ లలో లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) బాసర, మహబూబ్ నగర్ లలో లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. మొత్తం 1690 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించారు. శుక్రవారం ఎంపికైన అభ్యర్థుల జాబితాను బాసర ఆర్‌జీయూకేటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో విడుదల చేశారు. ఈ నెల 7,8,9 తేదీల్లో బాసర క్యాంపస్‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 7వ తేదీన 1 నుంచి 564 వరకు, 8న 565 నుంచి 1128 వరకు, 9న 1129 నుంచి 1,690 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
మొత్తం 19,877 దరఖాస్తులు
ఈ ఏడాదిలో ఆర్జీయూకేటీలో సీట్ల భర్తీకి సంబంధించి జూన్ లో అప్లికేషన్లు స్వీకరించగా, సుమారు 19,877 మంది విద్యార్థులు ధరఖాస్తు చేసుకున్నారు. వీరిలో టెన్త్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించారు. మిగిలిన సీట్లకు త్వరలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం కేటాయించిన 1690 మందిలో 1225 మంది అమ్మాయిలు, 465 మంది అబ్బాయిలు ఉన్నారు. సీట్లు పొందిన వారిలో 95 శాతం మంది ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు ఉండగా, 5 శాతం మాత్రమే ప్రయివేటు స్కూల్ స్టూడెంట్లు ఉన్నారు. ఫస్ట్ ఫేజ్ లో బాసర, మహబూబ్ నగర్ ట్రిపుల్ ఐటీలకు అమ్మాయిలు 1225, అబ్బాయిలు 465 మంది సెలెక్ట్ అయ్యారు.
నిజామాబాద్‌లో అత్యధికంగా 297 మందికి సీట్లు
ట్రిపుల్ ఐటీ సీట్లకు సంబంధించి మొత్తం 19967 దరఖాస్తులు అందగా, వాటిలో 19877 దరఖాస్తులు చెల్లుబాటు అయ్యాయి. స్థానిక విద్యార్థుల నుండి 19701 దరఖాస్తులు, ఏపీ, ఇతర రాష్ట్రాల నుండి 176 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల నుండి 8241 దరఖాస్తులు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల నుండి 7075 దరఖాస్తులు, ప్రైవేట్ పాఠశాలల నుండి 3985 దరఖాస్తులు వచ్చాయి. ఈ విద్యా సంవత్సరంలో అత్యధికంగా నిజామాబాద్ లో అత్యధికంగా 297 మంది, సంగారెడ్డి లో 222 మంది, కామారెడ్డిలో 128, మహబూబాబాద్లో 125, రాజన్న సిరిసిల్లలో 117, మెదక్ లో 78, జగిత్యాల లో 66 మందికి సీట్లు , అతి తక్కువగా వనపర్తి లో 4, జయశంకర్ భూపాలపల్లిలో 1 సీటు అలాట్ అయ్యాయి.






