- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైకోర్టు ఆదేశాలతో 12 ఏళ్ల నిరీక్షణకు తెర..
గత 12 సంవత్సరాలుగా నోషనల్ సీనియారిటీ కోసం ఎదురుచూస్తున్న మోడల్ స్కూల్ టీచర్లకు ఊరట లభించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: గత 12 సంవత్సరాలుగా నోషనల్ సీనియారిటీ కోసం ఎదురుచూస్తున్న మోడల్ స్కూల్ టీచర్లకు ఊరట లభించింది. రాష్ట్రంలోని 1326 మంది మోడల్ స్కూల్ టీచర్లకు లబ్ది చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2014 సెప్టెంబర్‌లో నియామకమైన మోడల్ స్కూల్ టీచర్లకు 2013 జూన్‌లో అపాయింటైన టీచర్లతో సమానంగా మూలవేతనం, సీనియారిటీ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే నోటిఫికేషన్‌లో ఎంపికైన టీచర్ల వేతనాల్లో వ్యత్యాసం ఉండడం సమంజనం కాదని పేర్కొంది. 2013 ఫస్ట్ ఫేజ్‌లో ఎంపికైన టీచర్లతో సమానంగా తమకు కూడా వేతనం ఇవ్వాలని, సీనియారిటీ కల్పించాలని సెప్టెంబర్ 2014లో విధుల్లో చేరిన టీచర్లు హైకోర్టుని ఆశ్రయించారు. అయితే ఆ కేసులో హైకోర్టు టీచర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంతో 2014 సెప్టెంబర్‌లో నియామకమైన టీచర్లకు 2013 జూన్ నుంచి రెగ్యులర్ స్కేల్ మంజూరు చేయనున్నారు. తాజా నిర్ణయంతో 2013 పీఆర్సీకి సైతం అర్హత వచ్చినట్లయిందని పలువురు టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒక్కొక్క టీచర్‌కు మూడు, నాలుగు ఇంక్రిమెంట్ల వేతన లబ్ది చేకూరనుంది. 2013 జూన్ నుంచి ఎరియర్స్ నోషనల్‌గా వర్తింపజేసి, ఏప్రిల్ లేదా జులై 2025 నుంచి నగదు ప్రయోజనాలు లభించనున్నాయి. 2013 జూన్ నుంచే సీనియారిటీ లెక్కిస్తారు. ఈ నిర్ణయంతో 768 మంది పీజీటీలు, 568 మంది కలిపి మొత్తం 1326 మంది లబ్ధిపొందనున్నారు. కాగా, పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.






