- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: జనగామలో పిడుగుపాటు..12 మందికి గాయాలు
తెలంగాణలో వర్షబీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పాడ్డాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో వర్షబీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పాడ్డాయి. వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.కొన్ని ప్రాంతాల్లో పిడుగులు సైతం పడ్డాయి. కామారెడ్డిలో పిడుగుపాటుకు నలభై గొర్రెలు మృతి చెందగా జనగామ జిల్లాలోనూ పిడుగు పడింది. ఈ పిడుగు పాటుకు ఏకంగా 12 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన బచ్చనపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తున్న సమయంలో మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో పిడుగుపడింది. ఈ ఘటనలో మొత్తం 12 మంది గాయపడగా 10 మందికి స్వల్పగాయాలు అయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.






