బ్రేకింగ్: పదవ తరగతి పరీక్ష పేపర్ లీక్.. ముగ్గురు సస్పెండ్

by Satheesh |   (  Updated:2023-04-03 10:54:28  IST  )

వికారాబాద్ జిల్లా తాండూరులో పరీక్ష ప్రారంభమైన కాసేపటికే పదవ తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయిన విషయం తెలిసిందే.

బ్రేకింగ్: పదవ తరగతి పరీక్ష పేపర్ లీక్.. ముగ్గురు సస్పెండ్
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా తాండూరులో పరీక్ష ప్రారంభమైన కాసేపటికే పదవ తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయిన విషయం తెలిసిందే. పరీక్ష ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే పేపర్ వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతుండగా.. మరోవైపు పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే పదవ తరగతి పేపర్ లీక్ కావడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో వికారాబాద్ పేపర్ లీక్ ఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పేపర్ లీకేజీకి కారణమైన ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఈ లీకేజీ వెనుక ఇంకా ఎవరు అయిన ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story