తెలంగాణకు కొత్తగా 108 పీజీ మెడికల్ సీట్లు

by Gantepaka Srikanth |

రాష్ట్ర వైద్య విద్యారంగానికి మరో శుభవార్త వచ్చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) 2025–26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా పీజీ సీట్లను మంజూరు చేసింది.

తెలంగాణకు కొత్తగా 108 పీజీ మెడికల్ సీట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వైద్య విద్యారంగానికి మరో శుభవార్త వచ్చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) 2025–26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా పీజీ సీట్లను మంజూరు చేసింది. రాష్ట్రంలోని 29 విభాగాల్లో మొత్తం 108 సీట్లు ఆమోదించబడ్డాయి. ఈ సీట్ల ఆమోదంతో తెలంగాణలో పీజీలో వైద్య విద్య అవకాశాలు మరింత విస్తరించనున్నాయి. రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు ఇది ప్రోత్సాహకర పరిణామంగా అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా మొత్తం కలిపి తెలంగాణ రాష్ట్రానికి 9 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 29 విభాగాల్లో 108 పీజీ సీట్లు ఆమోదించబడ్డాయి. ఇది రాష్ట్ర వైద్య విద్యా మౌలిక సదుపాయాల విస్తరణకు ఎంతో దోహదం చేస్తుందని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీడీఏ) అధ్యక్షుడు డా.నరహరి పేర్కొన్నారు.

రాష్ట్రానికి వివిధ కాలేజీల వారీగా కేటాయించిన పీజీ సీట్లు...

* హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీకి మొత్తం 23 పీజీ సీట్లు లభించాయి. అందులో ఎమ్‌డీ, పాథాలజీ 4, ఎమ్‌డీ, అనస్థీషియాలజీ 4, ఎమ్‌ఎస్, జనరల్ సర్జరీ 4, ఎమ్‌ఎస్, ఆర్థోపెడిక్స్ 2, ఎమ్‌ఎస్, ఈఎన్‌టి 2, ఎమ్‌డీ, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ 3, ఎమ్‌డీ, కమ్యూనిటీ మెడిసిన్ 2, ఎమ్‌డీ, పీడియాట్రిక్స్ 2 విభాగాలకు సీట్లు మంజూరయ్యాయి.

* గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, మహబూబ్‌నగర్‌కు ఎమ్‌ఎస్, ఈఎన్‌టి 2, ఎమ్‌ఎస్, ఆర్థోపెడిక్స్ 2 సీట్లు లభించాయి.

* గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, నల్గొండ‌కు 19 పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఎమ్‌డీ, అనస్థీషియాలజీ 4, ఎమ్‌ఎస్, ఆర్థోపెడిక్స్ 4, ఎమ్‌ఎస్, ఈఎన్‌టి 4, ఎమ్‌ఎస్, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ 3, ఎమ్‌డీ, పీడియాట్రిక్స్ 4 సీట్లున్నాయి.

* గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, నిజామాబాద్‌కు ఎమ్‌డీ, డెర్మటాలజీ, వెనెరియాలజీ అండ్ లెప్రసీ 4, ఎమ్‌డీ, పీడియాట్రిక్స్ 4 సీట్లులభించాయి.

* గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, రామగుండం‌కు 16 సీట్లు మంజూరయ్యాయి. వీటిలో ఎమ్‌డీ, ఎమర్జెన్సీ మెడిసిన్ 4, ఎమ్‌ఎస్, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ 4, ఎమ్‌ఎస్, ఆర్థోపెడిక్స్ 4, ఎమ్‌డీ, బయో-కెమిస్ట్రీ 4 ఉన్నాయి.

* గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, సిద్దిపేట‌కు ఎమ్‌డీ, రేడియో డయాగ్నోసిస్ 4, ఎమ్‌ఎస్, ఆర్థోపెడిక్స్ 4 సీట్లు మంజూరయ్యాయి.

* గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, సూర్యాపేట‌కు 16 సీట్లు లభించాయి. ఎమ్‌డీ, రెస్పిరేటరీ మెడిసిన్ 4, ఎమ్‌డీ, పాథాలజీ 4, ఎమ్‌డీ, అనస్థీషియా 4, ఎమ్‌డీ, పీడియాట్రిక్స్ 4 ఉన్నాయి.

* నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (నిమ్స్)కు ఎమ్‌డీ, ఇమ్యూనో హీమటాలజీ అండ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ విభాగానికి 4 సీట్లు మంజూరయ్యాయి.

* ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఎమ్‌డీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి 4 సీట్లు లభించాయి.

Next Story