టెస్ట్ రన్‌లో ముంబై మోనోరైల్‌కు ప్రమాదం

by Malleboina Mahesh |   (  Updated:2025-11-05 06:20:37  IST  )

వాడాలా డిపోలో పరీక్షాత్మక రన్ నిర్వహిస్తుండగా, మోనోరైల్ రైలు ట్రాక్‌ పై వంపుతిరిగినట్లు (derail) అధికారులు తెలిపారు.

టెస్ట్ రన్‌లో ముంబై మోనోరైల్‌కు ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మోనో రైల్ ప్రాజెక్టును పూర్తి చేసింది. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఈ ముంబైలో మోనోరైల్ టెస్ట్ రన్ సమయంలో చిన్న ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం వాడాలా డిపోలో పరీక్షాత్మక రన్ నిర్వహిస్తుండగా, మోనోరైల్ రైలు ట్రాక్‌ పై వంపుతిరిగినట్లు (derail) అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) అధికారులు స్పష్టం చేశారు.

ప్రమాదం జరిగిన వెంటనే సాంకేతిక బృందాలు అక్కడికి చేరుకుని, లోకోమోటివ్ భాగాలు, ట్రాక్ సర్దుబాటు వ్యవస్థలను పరిశీలించారు. రైలు ఎక్కడ వంపుతిరిగిందో తెలుసుకునేందుకు ఇంజనీరింగ్ టీమ్‌ పూర్తి స్థాయి విచారణ చేపట్టిందని వారు తెలిపారు. మోనోరైల్ సేవలను పునరుద్ధరించే ముందు భద్రతా తనిఖీలు పూర్తిగా నిర్వహించాలనే ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఇది ఒక టెక్నికల్ లోపం వల్ల జరిగిన చిన్న ఘటన మాత్రమేనని, మోనోరైల్ సర్వీసుల భద్రత పై ఎటువంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.

Next Story