- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
హుజురాబాద్ టికెట్ కన్ఫర్మ్ చేసిన KTR.. ఈటలకు పోటీగా ఆయనే!

దిశ, వెబ్ డెస్క్: హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరూ పోటీ చేస్తారనే దానిపై మంత్రి కేటీఆర్ నిన్న జరిగిన జమ్మికుంట బహిరంగ సభలో క్లారిటీ ఇచ్చారు. సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో ఈ సారి బీఆర్ఎస్ జెండా ఎగరాలని కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఈ విశ్వాసం తనలో కల్పించారని పరోక్షంగా ఆయనే అభ్యర్థి అని ప్రకటించారు. ఎన్నికలు వచ్చే వరకూ ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని కౌశిక్ రెడ్డితో అన్నారు. మోదీ రూ.100 లక్షల కోట్ల అప్పు చేయలేదా దమ్ముంటే చెప్పు ఈటల రాజేందర్ అని ప్రశ్నించారు.
14 నెలల కిందట బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను గెలిపించారు. ఇది చేస్తాం అది చేస్తాం అమిత్ షాను తీసుకొస్తాం అని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఒక్క రూపాయి వచ్చిందా? అన్నారు. కేసీఆర్ పాలన అరిష్టం అని ఈటల అన్నారు. బాధ అనిపించిందని తెలిపారు. అసలు ఈటలను హుజురాబాద్ కు పరిచయం చేసింది తండ్రి లాంటి కేసీఆర్ కాదా అని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిపై వ్యాఖ్యలతో హుజురాబాద్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి వైపే అధిష్టానం అనే క్లారిటీ రాగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పరిస్థితి ఏంటని స్థానికంగా చర్చ సాగుతోంది.
Also Read...