- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాలో ఎన్‍కౌంటరైన మావోయిస్టుల సాంగ్స్ వైరల్
ఆపరేషన్ కగార్‌తో మావోయిజం ముగింపు దశకు చేరుతుండగా హతమైన మావోయిస్టు నేతల ఫోటోలు, పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పోలీసులు హెచ్చరించినా?:
మారేడుమిల్లి అడవుల్లో గతేడాది నవంబర్ లో ఏపీ పోలీసుల చేతిలో హతమైన మావోయిస్టు పార్టీ గెరిల్లా దాడి వ్యూహకర్త మడావి హిడ్మా ఆయన భార్య రాజే ఫోటోలు పెద్ద ట్రెండ్ అవుతున్నాయి. హిడ్మా, రాజేలు ఇద్దరు కలిసి అడవుల్లో ఉన్నట్లు, వారు గిరిజనులతో మాట్లాడుతూ వారికి జంగల్ రక్షించుకోవడానికి శిక్షణ ఇస్తున్నట్లు ఏఐ తో క్రియేట్ చేసిన వీడియోలకు సినిమా పాటలు, డైలాగులు జోడించి వైరల్ చేస్తున్నారు. కాగా గత నెలలో ఛత్తీస్‍గఢ్‍లోని బస్తర్ జిల్లా (Bastar) జగదల్ పూర్‍లో జరిగిన భూంకాల్ 116 వార్షికోత్సవం ర్యాలీలో ఆయన పేరుతో సాగే ఓ పాట డీజే వెర్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఈ ర్యాలీలో హిడ్మా పేరుతో ఉన్న ఓ డీజే వెర్షన్ పాటను స్పీకర్లలో ప్లే చేశారు. ఇలాంటి పాటలపై అప్పట్లో పోలీసులు సైతం యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. కానీ హతమైన మావోయిస్టులకు సంబంధించిన ఫోటోలకు పాటలు జోడించిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు.






