ibomma Ravi: సాక్ష్యాలు ఉన్నాయా..? ఐబొమ్మ రవికి మూడు మేజర్ ఎగ్జిట్ గేట్స్!

by Ramesh Naini |   (  Updated:2026-02-12 15:38:12  IST  )

ఐబొమ్మ రవికి న్యాయనిపుణుల విశ్లేషణ ప్రకారం మూడు మేజర్ ఎగ్జిట్ గేట్స్ ఉన్నాయని చర్చ జరుగుతోంది. మొదటిది అతని పౌరసత్వం.. రవి ఇప్పుడు భారతీయుడు కాదు, భారత పౌరసత్వం రద్దు చేసుకోని, అతను ‘సెయింట్ కిట్స్ అండ్ నెవిస్’ దేశ పౌరసత్వం కలిగి ఉన్నాడు.

ibomma Ravi: సాక్ష్యాలు ఉన్నాయా..? ఐబొమ్మ రవికి మూడు మేజర్ ఎగ్జిట్ గేట్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పైరసీ వెబ్‌సట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవి అరెస్ట్ వ్యవహారం చర్చానీయాంశంగా మారింది. చాలా మంది అతనికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ తను పైరసీ చేయడంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించింది. దీంతో ఐబొమ్మ రవిపై పైరసీ, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వంటి అంశాలతో మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం రవి పోలీస్ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే, ఐబొమ్మ రవి మాస్టర్ మైండ్‌ను ఎవరైనా మెచ్చుకోవాల్సిందేనట. దేశ చట్టాల్లో ఉన్న లొసుగులు అతనికి కవచంలా మారబోతున్నాయా? అనేది హాట్ టాపిక్‌‌గా మారింది. పోలీసుల వద్ద సాక్ష్యాలు ఉన్నాయా..? అని సర్వత్రా చర్చానీయాంశంగా మారింది.

న్యాయనిపుణుల విశ్లేషణ ప్రకారం రవికి మూడు మేజర్ ఎగ్జిట్ గేట్స్ ఉన్నాయని చర్చ జరుగుతోంది. మొదటిది అతని పౌరసత్వం.. రవి ఇప్పుడు భారతీయుడు కాదు, భారత పౌరసత్వం రద్దు చేసుకోని, అతను ‘సెయింట్ కిట్స్ అండ్ నెవిస్’ దేశ పౌరసత్వం కలిగి ఉన్నాడు. ఒక విదేశీ పౌరుడిని భారత చట్టాల ప్రకారం విచారించాలంటే చాలా లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. నేను ఫారెన్ సిటిజన్‌‌ని, మీ చట్టాలు నాకు పూర్తిగా వర్తించదని అతను అంతర్జాతీయ కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది. రెండోది ఐబొమ్మ వెబ్‌సైట్ సర్వర్లు ఇండయాలో లేవు. అమెరికా, యూరప్ నెదర్లాండ్స్ వంటి దేశాల్లో క్లౌడ్ సర్వర్లలో ఉన్నాయి.

పోలీసులు కోర్టులో అతనిని దోషిగా నిలబెట్టాలంటే ఆ సర్వర్లలో ఉండే డేటాని కోర్టు ముందు ఉంచాలి.. మూడు వేరే దేశంలో ఉన్న సర్వర్ డేటాని తెలంగాణ పోలీసులు డైరెక్ట్‌గా ఎలా తీసుకోగలరు. ఈ కేసులో అతి పెద్ద వీక్ పాయింట్ ఇదే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇక, రవి సినిమాలను హోస్ట్ చేయలేదని, ఆ సినిమాలను వేరే ఎవరో టెలిగ్రామ్ వంటి సామాజిక మాద్యమాల్లో అప్‌లోడ్ చేసినవని, రవి కేవలం ఆ లింక్‌లను ఒక చోట చేర్చారని, దీంతో ఐటీ చట్టం ప్రకారం థార్ట్ పార్టీ కంటెంట్‌కి ఓనర్ బాధ్యత వహించాల్సిన అవసరం లేదని మరో వాదన వినిపిస్తోంది.

Next Story