ప్రపంచవ్యాప్తమైన బతుకమ్మ.. బూర్జ్ ఖలీఫాపై తెలంగాణ నినాదం

by  |
ప్రపంచవ్యాప్తమైన బతుకమ్మ.. బూర్జ్ ఖలీఫాపై తెలంగాణ నినాదం
X

దిశ, వెబ్‌డెస్క్: బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పండుగ రంగురంగుల హంగులతో వెల్లివిరిసింది. కన్నులను మిరుమిట్లు గొలిపే కాంతులతో తెలంగాణ పండుగ జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో పూవుల పండుగ సంబురం అంబరాన్నంటింది. బూర్జ్ ఖలీఫా టవర్‌పై బతుకమ్మ పువ్వులు పూస్తున్నాయా.. అనేలా భారీ లైటింగ్ షో అందరినీ ఆకట్టుకుంది. 9.40 నిమిషాల నుంచి 10.40 వరకు గంటసేపు ప్రపంచంలోనే అతిపొడవైన బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వీడియో ప్రదర్శన జరగడం ఎంతగానో ఆకట్టుకుంది. ఇదే టవర్‌పై సీఎం కేసీఆర్ బొమ్మ అదిరింది. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ ఉత్సవం నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ఉదయమే అక్కడికి చేరుకున్నారు. ఆమెతో పాటు ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎంపీ సురేష్ రెడ్డి, పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జాజాల సురేందర్, షకీల్, డా. సంజయ్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రవాస తెలంగాణ బిడ్డలు ఘన స్వాగతం పలికారు. టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ సంఘాలు, జాగృతి ప్రతినిధులు దుబాయ్ వీధుల్లో భారీ ర్యాలీతో స్వాగతం పలుకుతూ.. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు.



Next Story