- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గల్ఫ్‌లో తెలంగాణ వాసి మృతి
by Shyam |
<p>దిశ నిర్మల్: భార్య పిల్లలు, పుట్టిన ఊరును వదిలి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన తెలంగాణ వాసి మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సోన్ మండలం కూచన్‌పల్లి గ్రామానికి చెందిన కడుదురం పోశెట్టి పదేళ్లుగా గల్ఫ్‌లోనే పనిచేస్తూ ఇంటికి డబ్బులు పంపుతున్నాడు. పోశెట్టికి నలుగురు కుమార్తెలు కాగా.. ఇద్దరి వివాహం చేశాడు. ఇదేక్రమంలో కరోనా మహమ్మారి విజృంభించి కంపెనీలు సరిగా జీతాలు చెల్లించకపోవడంతో అప్పులు చేసిన పోశెట్టి అక్కడే ఉన్నాడు. 10రోజుల క్రితం […]</p>

X
దిశ నిర్మల్: భార్య పిల్లలు, పుట్టిన ఊరును వదిలి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన తెలంగాణ వాసి మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సోన్ మండలం కూచన్‌పల్లి గ్రామానికి చెందిన కడుదురం పోశెట్టి పదేళ్లుగా గల్ఫ్‌లోనే పనిచేస్తూ ఇంటికి డబ్బులు పంపుతున్నాడు. పోశెట్టికి నలుగురు కుమార్తెలు కాగా.. ఇద్దరి వివాహం చేశాడు. ఇదేక్రమంలో కరోనా మహమ్మారి విజృంభించి కంపెనీలు సరిగా జీతాలు చెల్లించకపోవడంతో అప్పులు చేసిన పోశెట్టి అక్కడే ఉన్నాడు. 10రోజుల క్రితం పోశెట్టి అనారోగ్యానికి గురై చనిపోయినట్లు అధికారులు ఫోన్‌లో సమాచారం ఇచ్చారని అతని భార్య పద్మ తెలిపింది. ప్రభుత్వం వీలైనంత త్వరగా తన భర్త మృతదేహాన్ని తీసుకువచ్చేలా కృషి చేయాలని మొరపెట్టుకుంటోంది. పోశెట్టి కుటుంబ సభ్యులు తీవ్ర:దుఖంలో మునిగిపోయారు.
Next Story






