వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

by  |
వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి
X

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: వైద్యారోగ్య శాఖ‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల స‌మ‌స్య‌లు పరిష్క‌రించాల‌ని రాష్ట్ర మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కర్నాటి సాయి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవారం సీఎస్ సోమేష్ కుమార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపి స‌మ‌స్య‌లను విన్నవించారు.

ఈ సందర్భంగా కర్నాటి సాయిరెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పని చేస్తున్న ఉద్యోగులందరికీ 10% ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరారు. కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రతినెలా ఒకటో తారీఖున వేతనాలు అందేలా చూడాలని కోరారు. అంతేకాకుండా ఆశా వర్కర్లకు రూ. 15,000 పారితోషికంలా కాకుండా నిక‌ర వేతనంగా ఇవ్వాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల పదోన్నతులు ఇస్తూ మహిళా ఉద్యోగులకు సీహచ్ఓ ప్రమోషన్‌లు ఇవ్వాల‌ని సీఎస్‌ను కోరినట్లు తెలిపారు. విధి నిర్వహణలో చనిపోయిన ఆశా వర్కర్లకు రూ.25 లక్షలను ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వీటిపై సీఎస్ సోమేష్ కుమార్ సానుకూలంగా స్పందించారని సాయిరెడ్డి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కొండా పురుషోత్తం రెడ్డి, ఎం.సుదర్శన్, సత్యనారాయణ, రవిచందర్, నాగరాజు, ప్రమోద్ కుమార్, కే శ్రీనివాస్, ఎం వెంకట్, నరహరి తదితరులు పాల్గొన్నారు.


Next Story