తెలంగాణలో ఆశ్చర్యం కలిగిస్తోన్న కరోనా.. కొత్త కేసులెన్నంటే ?

by  |
corona
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్ట వ్యాప్తంగా కొత్తగా మరో 257 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. దీంతో కరోనా కేసుల మొత్తం సంఖ్య 6,57,376 కు చేరుకోగా, డిశ్చార్జ్ ల సంఖ్య 6,47,594కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 87 తేలగా, ఆదిలాబాద్ లో 2, భద్రాద్రి కొత్తగూడెంలో 4,జగిత్యాలలో 4, జనగామ 8,గద్వాలలో 1, కరీంనగర్ లో 16, ఖమ్మంలో 18, ఆసీఫాబాద్ లో 1, మహబూబ్ నగర్ లో 5, మహబూబాబాద్ లో 6 , మంచిర్యాల 4, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 9, ములుగు లో 4, నల్లగొండ 6, నిజామాబాద్ లో 3, పెద్దపల్లిలో 5, రాజన్న సిరిసిల్లాలో 5, రంగారెడ్డిలో 18, సంగారెడ్డిలో 7, సిద్దిపేట్ లో 5, సూర్యాపేట్ లో 11, వనపర్తిలో 2, వరంగల్ రూరల్ లో 5, వరంగల్ అర్బన్ లో 18, యాదాద్రి భువనగిరిలో మరో 2 కేసులు చొప్పున తేలాయి. దీంతో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 5,912కి చేరగా వీరిలో 95 శాతం మంది హోం ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed