కర్ణాటక బార్డర్ వద్ద గట్టి చర్యలు చేపట్టండి 

by  |
కర్ణాటక బార్డర్ వద్ద గట్టి చర్యలు చేపట్టండి 
X

దిశ, మహబూబ్ నగర్: తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని చెక్ పోస్టుల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలని డీఐజీ శివశంకర్ రెడ్డి అన్నారు. జిల్లా సరిహద్దుల్లో తీసుకుంటున్న జాగ్రత్తలను ఆయన పరిశీలించారు.ఈ నేపథ్యంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన, ఎస్పీ డా.చేతన, వికారాబాద్ ఎస్పీ నారాయణతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ జిల్లాలో వ్యాపించకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక, నారాయణపేట జిల్లా సరిహద్దుల్లో ని చెక్ పోస్టుల వివరాలు తెలుసుకుని పలు సలహాలు, సూచనలు చేశారు. సరిహద్దు చెక్ పోస్టులైనా 1. కృష్ణ పోలీస్ పరిధిలోని థైరోడ్ జంక్షన్, 2. చేగుంట చెక్ పోస్ట్, దామరగిద్ద పోలీస్ పరిధిలోని 3.కనుకుర్తి చెక్ పోస్టు, 4. సజ్జనపూర్ చెక్ పోస్ట్, 5.విఠలాపూర్ చెక్ పోస్టు, 6.ఉల్లి గుండం చెక్ పోస్టు, నారాయణపేట్ పోలీస్ పరిధిలోని 7.ఎక్లాస్పూర్, 8.జలాల్ పూర్, ఉట్కూర్ పోలీస్ పరిధిలోని 9. అమీన్పూర్ చెక్ పోస్టుల వద్ద ప్రభుత్వ, ఇతర అధికారులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఒక్కరినీ తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. జిల్లాలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజనం, మంచినీరు సరఫరా చేయాలని,మాస్కులు, శానిటైజర్, గ్లౌజులు అందించాలని అధికారులను కోరారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపైకి రావొద్దని డీఐజీ సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, ఎస్పీ డాక్టర్ చేతన, వికారాబాద్ ఎస్పీ నారాయణ పాల్గొన్నారు.

Tags : telangana-karnataka border, take serious actions, ts dig, shiva shanker,corona, lockdown


Next Story

Most Viewed