మా ఉద్యోగులను పంపండి.. ఏపీ సీఎస్‌కు తెలంగాణ విజ్ఞప్తి

by Vadlamudi Anukaran |

<p>దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ స్థానికత కలిగి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులను అక్కడి నుంచి రిలీవ్ చేసి పంపించాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వారిని తెలంగాణ రాష్ట్రం తీసుకోడానికి సిద్ధంగా ఉందని ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఈ వ్యవహారంలో గతంలో చర్చలు జరిగిన తదనంతర పరిస్థితుల్లో రాష్ట్ర విభజన వ్యవహారాల నోడల్ అదికారిగా ఉన్న ఆర్థిక శాఖ [&hellip;]</p>

మా ఉద్యోగులను పంపండి.. ఏపీ సీఎస్‌కు తెలంగాణ విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ స్థానికత కలిగి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులను అక్కడి నుంచి రిలీవ్ చేసి పంపించాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వారిని తెలంగాణ రాష్ట్రం తీసుకోడానికి సిద్ధంగా ఉందని ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఈ వ్యవహారంలో గతంలో చర్చలు జరిగిన తదనంతర పరిస్థితుల్లో రాష్ట్ర విభజన వ్యవహారాల నోడల్ అదికారిగా ఉన్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సైతం ఆంధ్రప్రదేశ్ విభజన వ్యవహారాలు చూసే ఐఏఎస్ అధికారి ప్రేమ్‌చంద్రారెడ్డికి ఈ నెల 9వ తేదీన లేఖ రాశారు.

సమైక్య రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులను తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడంపై కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను జారీ చేసి ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసింది. అయితే తెలంగాణలో ఉండడానికే ఇష్టపడి ఆప్షన్ ఇచ్చుకున్నప్పటికీ కొద్దిమందిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. తెలంగాణ స్థానికత కలిగిన అలాంటి 698 మంది క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంపై ఆ ఉద్యోగుల నుంచి తెలంగాణకు విజ్ఞాపనలు అందాయి. ఈ విషయంపై రెండు రాష్ట్రాల విభజన వ్యవహారాలను చూసే అధికారులు చర్చించుకున్నారు.

చివరకు రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం ఆ ఉద్యోగులను తిరిగి తెలంగాణకు పంపడానికి ఏపీ ప్రభుత్వం సమ్మతించింది. ఆ ప్రకారం వారిని వీలైనంత త్వరగా తెలంగాణకు పంపాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి తెలంగాణ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. ఏపీలో ప్రస్తుతం ఏ ర్యాంకులో ఉద్యోగులు పనిచేస్తున్నారో తెలంగాణలో కూడా అదే ర్యాంకులో పనిచేయడానికి సిద్ధమైనవారిని జాబితా ప్రకారం రిలీవ్ చేయాలని ఏపీ సీఎస్‌కు రాసిన లేఖలో తెలంగాణ సీఎస్, ఆ రాష్ట్ర విభజన వ్యవహారాలు చూసే అధికారికి తెలంగాణ అధికారి రామకృష్ణారావు రాసిన లేఖల్లో పేర్కొన్నారు.

Next Story