బిగ్ బ్రేకింగ్ : MLC ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన

by  |
బిగ్ బ్రేకింగ్ : MLC ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి నిర్వహించాల్సిన ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వెంటనే నిర్వహించడానికి అనువైన వాతావరణం లేదని, అందువల్ల మరికొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించాలనుకోవడం లేదని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3వ తేదీన ముగిసింది.

వీటిని భర్తీ చేసేందుకు అప్పుడే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా.. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమిషనే కొంతకాలం వాయిదా వేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తెలియజేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నాలుగు రోజుల క్రితం లిఖితపూర్వకంగా కోరింది. దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం రాత్రి సీఈసీకి లేఖ రాశారు. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని రోజుల పాటు ఎన్నికల నిర్వహణను వాయిదా వేయడం ఉత్తమమని, ప్రస్తుతం నిర్వహించాలనే అభిప్రాయంతో లేమని రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖలో స్పష్టం చేసింది.


Next Story

Most Viewed