తెలంగాణలో తాజాగా పాజిటివ్ కేసులెన్నంటే..?

by  |
telangana corona sticker
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ, మరణాల సంఖ్య రోజురోజుకూ భయంకరంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,361 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారినపడి 51 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,69,722 కి చేరాయి. మరణాల సంఖ్య 2,527కు పెరిగాయి. నిన్న ఒక్కరోజులోనే 8,126 మంది నుంచి డిశ్చార్జి కాగా.. మొత్తంగా 3,89,491 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,704 యాక్టివ్ కేసులున్నట్టు హెల్త్ బులెటిన్ స్పష్టం చేసింది.


Next Story

Most Viewed