- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది నుంచి కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. విద్యాసంస్ధలు తెరిచినా కరోనా కేసుల్లో పెరుగుదల లేదని, కరోనా పూర్తిగా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది నుంచి కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది.
విద్యాసంస్ధలు తెరిచినా కరోనా కేసుల్లో పెరుగుదల లేదని, కరోనా పూర్తిగా అదుపులోనే ఉందని కేబినెట్‌కు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 2.56 కోట్లకుపైగా కరోనా టీకా డోసులు పంపిణీ చేశామని, నేటి నుంచి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు చెప్పారు. చిన్నపిల్లలకు కరోనా వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Next Story






